eppatiki ardamayyindi - ఒప్పేసుకున్నారు

మొత్తానికి ఒప్పేసుకున్నారు  
రాత్రి కురిసిన వర్షానికి తడిసిన రోడ్లు ఇంకా ఆరనేలేదు. కానీ పోట్టకుటికోసం ప్రతిరోజు పరిగెత్తే సగటు జీవి తన ప్రయాణాన్ని మొదలేట్టెసాడు. అసలే వర్షానికి ఇబ్బందిగా మారిన రోడ్డు పై - హైవే, ట్రాఫ్ఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఆఫీసులకి, కాలేజీలకి లేట్ అవ్తోంది అంటూ అసహనంగా ఉన్న ప్రజలను మరికాస్త ఎక్కువ ఇబ్బంది పెట్టటానికి రెడీ అయిపోయారు మన పసుపు తమ్ముళ్ళు . జండాలు పట్టుకుని ఎల్.బి.నగర్ చురస్త లో బైట్టయించేసారు. భావి తెలుగు తరాలని మోసం చెయ్యద్దు అంటూ చేతులు చాచి ప్రద్దేయపడ్డారు.తెలివి ఉన్న తెలుగు పిల్లలకు చదువు అందని ద్రాక్షగ మారుస్తార అంటూ కిరణ్ సర్కార్ మీద విరుచుకుపడ్డారు. స్వయానా నారా వారె ధర్నాలో భైటాయించారు. ఇంకేముంది, తమని తాము తెలుగు తమ్ముల్లగా పిలుచుకునే పసుపు తమ్ముళ్ళు ఆవరనం మోతాన్ని ఆదరకోట్టారు.
ఇంతకీ వాళ్ళు చెప్పోచేది ఏంటి అంటే, రాజన్న ప్రవేసపెట్టిన  ఫీజు రేంబుర్స్మెంటు కచితంగా అమలు పరచాలి అని. మహాకర్యానిక ఎటువంటి తోక రూల్స్ పెట్టకుండా యధాతధంగా అర్హులైన ప్రతి పేదవాడికి వర్తింపచేయాలని. బాబు గారికి ఇప్పటికి సత్యం బోధపదినట్టు ఉంది. రాజన్నని తెలుగు జనం తమ గుండెలోతుల్లో పెట్టుకుని ఎందుకు పూజిస్తున్నార అని. ఇప్పటికి పసుపు బ్రదర్స్ కి అర్దమైయ్యింది జగన్ మోహన్ రెడ్డి ని, ఆప్యాయంగా జగన్ అన్న అని ఎందుకు పిలుచుకుంటారని.
మొతానికి నారా వారి ముందుకిపోయే పధకం చూస్తుంటే మన రాజన్న పధకాలు  ప్రజా శ్రేయస్కరం అని ఒప్పెసుకునట్టు ఉన్నారు. అల కుదరదు, ఒప్పుకోము!!! అంటే మాత్రం జనం వరిమధ్యకి బాబు గారిని ఆయన తమ్ముళ్ళని రానివ్వరుగాక రానివ్వరు.

Share this

Related Posts

Previous
Next Post »